డాన్ బాస్కో స్కూల్లో వైభవంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు
తల్లాడ: అక్టోబర్ 10 : మన తెలుగు A న్యూస్
తల్లాడ మండలం పినపాక గ్రామంలోని డాన్ బాస్కో స్కూల్ ఆవరణలో దసరా పండుగను పురస్కరించుకొని ముందస్తు బతుకమ్మ వేడుకలను శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. స్కూల్ ప్రిన్సిపాల్ ప్రదీప్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సంబరాల్లో పాఠశాల విద్యార్థినులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ వేడుకల్లో భాగంగా విద్యార్థినులు సాంప్రదాయ దుస్తులలో ముస్తాబై, రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా అమర్చారు. అనంతరం బతుకమ్మల చుట్టూ చేరుతు, చప్పట్లు కొడుతూ సాంప్రదాయ పాటలకు అనుగుణంగా నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ప్రదీప్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల్లో చదువుతో పాటు మన సంస్కృతి, సాంప్రదాయాల పట్ల అవగాహన కల్పించేందుకే ఇటువంటి వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థినుల ఆటపాటలతో పాఠశాల ఆవరణలో కోలాహల వాతావరణం నెలకొంది. తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా సాగిన ఈ వేడుకలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.



0 కామెంట్లు
మీ అభిప్రాయాన్ని తెలపండి! 🙏
ఈ వార్తపై మీ కామెంట్ ఇక్కడ రాయండి - మన ఖమ్మం వార్తల కోసం!