తల్లాడలో వాగుల ఉద్ధృతిపై అధికారుల అప్రమత్తత.. తహసీల్దార్, ఎంపీవో హెచ్చరిక - వాగులు దాటొద్దు!

 వాగుల ఉద్ధృతిపై అధికారుల అప్రమత్తత


బిల్లుపాడు, రామచంద్రపురం, గొల్లగూడెం ప్రాంతాల్లో ముందస్తు చర్యలు



తల్లాడ, సెప్టెంబర్ 24:( మన తెలుగు A న్యూస్)..


తల్లాడ మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వాగులు ఉద్ధృతంగా ప్రవహించే అవకాశం ఉన్న ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. బిల్లుపాడు, రామచంద్రపురం, గొల్లగూడెం ప్రాంతాల్లో వాగుల ప్రవాహం పెరిగే అవకాశం ఉండటంతో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. వాగుల వద్ద రాకపోకలు సాగించకుండా రహదారులపై వాహనాలను అడ్డంగా ఏర్పాటు చేసి ప్రజలు, వాహనాలు రాకపోకలు చేయకుండా నియంత్రించారు.ఈ సందర్భంగా తహసీల్దార్ కరుణాకర్ రెడ్డి, ఎంపీవో శ్రీహరికృష్ణ మాట్లాడుతూ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాగులు, కల్వర్టుల వద్ద నీటి ప్రవాహం పెరిగే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని దాటేందుకు ప్రయత్నించవద్దని, వాహనదారులు మరింత జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని అవసరమైన ప్రాంతాల్లో రాకపోకలను నియంత్రిస్తున్నామని, అధికారులు ఏర్పాటు చేసిన అడ్డంకులను తొలగించి ప్రయాణించవద్దని కోరారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు.వాగుల ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పరిస్థితులకు అనుగుణంగా తదుపరి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ





 కార్యక్రమంలో కొత్త వెంకట గిరి సర్పంచ్ దీవెల వెంకటేశ్వర రావు, ఉపసర్పంచ్ రుద్రాక్ష రామక్రిష్ణ చారి,ఎంపీడీఓ సూపరిడెంట్ , బిల్లుపాడు పంచాయతీ కార్యదర్శి సాయి, గొల్లగూడెం సెక్రటరీ నరేష్ బిల్లుపాడు పంచాయతీ సిబ్బంది ఎలమర్తి పవన్ ,తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1 కామెంట్‌లు

మీ అభిప్రాయాన్ని తెలపండి! 🙏
ఈ వార్తపై మీ కామెంట్ ఇక్కడ రాయండి - మన ఖమ్మం వార్తల కోసం!