తల్లాడ: మండలంలోని బిల్లుపాడు గ్రామ పంచాయతీ పరిధిలో గత రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని భారీ వర్షాలు, ఈదురుగాలులకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
*చెట్టు పడి దెబ్బతిన్న రేకుల షెడ్డు - తప్పిన ప్రమాదం:*
బిల్లుపాడు జేకే నగర్ లో నివసిస్తున్న చాటల రమేష్ కు చెందిన రేకుల షెడ్డుపై భారీ చెట్టు కొమ్మ విరిగిపడి షెడ్డు దెబ్బతింది. ఈ ఘటనలో షెడ్డు , పాక్షికంగా దెబ్బతింది. ఘటన జరిగిన సమయంలో రమేష్ కుటుంబం ఇంట్లోనే నిద్రిస్తున్నారు. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణాపాయం జరగకపోవడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. అయితే షెడ్డు దెబ్బతినడంతో ఆ కుటుంబం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అధికారులు స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు.
'విరిగిపడిన విద్యుత్ స్తంభాలు:*
భారీ వర్షం, ఈదురుగాలులకు బిల్లుపాడు పంచాయతీ పరిధిలో పలు చోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి మరమ్మతు పనులు చేపడుతున్నారు.
*శుక్రవారం నుంచి తగ్గుముఖం పట్టిన వెంకటగిరి వాగు - పరిశీలించిన కార్యదర్శులు:*
బిల్లుపాడు నుంచి కొత్త వెంకటగిరి, రామచంద్రపురం మీదుగా వెళ్లే వెంకటగిరి వాగు గత రెండు రోజులుగా ఉధృతంగా ప్రవహించింది. అయితే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం నుంచి వాగు తగ్గుముఖం పట్టింది. దీంతో రాకపోకలకు ఉన్న అంతరాయం తొలగిపోయే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో బిల్లుపాడు పంచాయతీ కార్యదర్శి, కొత్త వెంకటగిరి పంచాయతీ కార్యదర్శి, రామచంద్రపురం పంచాయతీ కార్యదర్శి సంయుక్తంగా వెంకటగిరి వాగును పరిశీలించారు. వాగు నీటి మట్టాన్ని, పరిసర ప్రాంతాలను పరిశీలించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిల్లుపాడు పంచాయతీ సిబ్బంది లాజర్ పవన్ తదితరులు పాల్గొన్నారు



0 కామెంట్లు
మీ అభిప్రాయాన్ని తెలపండి! 🙏
ఈ వార్తపై మీ కామెంట్ ఇక్కడ రాయండి - మన ఖమ్మం వార్తల కోసం!