రేవంత్ సర్కార్ కానుక - బిల్లుపాడు పాఠశాలలో విద్యార్థులకు కొత్త యూనిఫాం, బెల్టు, షూస్!
తల్లాడ, : సెప్టెంబర్ 30 (మన తెలుగు A న్యూస్)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన విద్యార్థులకు ఉచిత యూనిఫాం పథకం కింద తల్లాడ మండలం బిల్లుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మంగళవారం యూనిఫాం, షూస్, బెల్టు పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన ఈ పథకంలో భాగంగా బిల్లుపాడు ZPHS పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ నూతన యూనిఫాంలు, షూస్, బెల్టులను అందజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిల్లుపాడు గ్రామ సర్పంచ్ ఎనిక కృష్ణవేణి , ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జక్కంపూడి కిషోర్ హాజరయ్యారు. వారి చేతుల మీదుగా విద్యార్థులకు యూనిఫాంలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు సామినేని రామప్పరావు మాజీ ఎంపీటీసీ బత్తుల రామదాసు ఎనిక నరసింహారావు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ కృష్ణవేణి మాట్లాడుతూ - "ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారు. విద్యార్థులకు యూనిఫాం, షూస్ ఇవ్వడం వల్ల పేద విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. విద్యార్థులందరూ బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి" అని ఆకాంక్షించారు.
జక్కంపూడి కిషోర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు.
కార్యక్రమం అనంతరం విద్యార్థులు కొత్త యూనిఫాంలు ధరించి ఆనందం వ్యక్తం చేశారు.
- బీసీ కాలనీలో పారిశుధ్య పనులు:
యూనిఫాం పంపిణీ అనంతరం బిల్లుపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని బీసీ కాలనీ మరియు డీవీ కాలనీలో పారిశుధ్య పనులు ముమ్మరంగా చేపట్టారు.
రోడ్డుకు ఇరువైపులా ఉన్న కచ్చా కాలువలలో పేరుకుపోయిన మట్టి, పూడికను JCB సహాయంతో పూర్తిగా తొలగించారు. అంతేకాకుండా కాలనీలో రోడ్లకు ఇరువైపులా పెరిగిన కంప చెట్లు, ముళ్ల పొదలను కూడా JCB తో తొలగించి కాలనీని శుభ్రం చేశారు.
గత కొంతకాలంగా వర్షపు నీరు, మురుగు నీరు కాలువల్లో నుండి పొంగి రోడ్లపైకి వచ్చి స్థానికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. దోమల బెడద కూడా పెరిగింది. ఈ సమస్యను గుర్తించిన గ్రామ పంచాయతీ వారు, కాంగ్రెస్ నాయకులు జక్కంపూడి కిషోర్ ఆధ్వర్యంలో మురుగునీరు, వర్షపు నీరు ఎక్కడా నిలిచిపోకుండా సాఫీగా వెళ్లేలా డ్రైనేజీలను పునరుద్ధరించారు.
ఈ కార్యక్రమంలో తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కిషోర్ డీబి కాలనీలోని డ్రైనేజీలు, కాలవలను స్వయంగా పరిశీలించి JCB తో పనులు సక్రమంగా జరిగేలా పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది గ్రామ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు





0 కామెంట్లు
మీ అభిప్రాయాన్ని తెలపండి! 🙏
ఈ వార్తపై మీ కామెంట్ ఇక్కడ రాయండి - మన ఖమ్మం వార్తల కోసం!