మన తెలుగు A న్యూస్ ఎఫెక్ట్ తల్లాడ - బిల్లుపాడు రోడ్ క్లియర్ స్థానికుల హర్షం..


 తల్లాడ సెప్టెంబర్ 28 :( మన తెలుగు A న్యూస్)

 ఖమ్మం జిల్లా తల్లాడ మండలం తల్లాడ నుండి బిల్లుపాడు కొత్త వెంకటగిరి వెళ్లే రోడ్డు మార్గం మార్గంలో అంజనాపురం రేజర్ల పంచాయతీ సమీపంలో నిన్న రోడ్డు మీద అడ్డంగా పడిపోయిన భారీ చెట్టును ఈరోజు పంచాయతీ సిబ్బంది ఎంతో శ్రమించి తొలగించారు 




చెట్టు రోడ్డుపై పడిపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయంపై *మన తెలుగు A-న్యూస్ లో వార్త ప్రచురితం కావడంతో* సంబంధిత అధికారులు,  వెంటనే స్పందించారు.



ఈరోజు ,  పంచాయతీ సిబ్బంది  రోడ్డుపై పడిన చెట్టు కొమ్మలను నరికి తొలగించి రాకపోకలకు అంతరాయం లేకుండా చేశారు. రోడ్డు క్లియర్ కావడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. వార్తకు వెంటనే స్పందించి చెట్టును తొలగించిన రేజర్ల పంచాయతీ సిబ్బందికి మరియు ఈ వార్త ప్రచురించిన మన తెలుగు A న్యూస్ కు  స్థానికులు మరియు వాహనదారులు  కృతజ్ఞతలు తెలిపారు



అదే మార్గంలో మరో సమస్య: రేజర్ల గ్రామాన్ని కమ్మేసిన పిచ్చిచెట్లు.


ఇదిలా ఉండగా ఈ చెట్టు పడిన ప్రదేశానికి అతి సమీపంలోనే ఉన్న *రేజర్ల గ్రామంలో* మరో సమస్య ఉందని స్థానికులు వాపోతున్నారు. గ్రామానికి ఇరువైపులా ఉన్న రోడ్డు మార్గంలో యూకలిప్టస్ చెట్లు, పిచ్చిమొక్కలు, పొదలు విపరీతంగా హరితహారం మొక్కలు బాగా గుబురుగా  పెరిగి గ్రామం కనిపించకుండా కమ్మేశాయని, దీనివల్ల రాత్రివేళల్లో విషసరపాలు సంచరించటం  వాహనదారులకు గ్రామం ఉందనే విషయం తెలియక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


 అధికారులు రేజర్ల గ్రామ పరిసరాల్లో ఉన్న చెట్లు, పొదలను కూడా వెంటనే తొలగించి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడాలని సంబంధిత అధికారులను గ్రామస్తులు కోరుతున్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు