పీర్ల ముజావర్ షేక్ యూసుఫ్ ఆధ్వర్యంలో.. ఘనంగా గ్యార్మీ వేడుకలు

 

సంప్రదాయబద్ధంగా వేడుకలు భక్తిశ్రద్ధలతో కొనసాగిన ర్యాలీ.


మత సామరస్యం,ఆధ్యాత్మిక సంప్రదాయాలకు ప్రతీకగా గ్యార్మీ పండుగ.



తల్లాడ అక్టోబర్ 10:  మన తెలుగు A న్యూస్,


తల్లాడ పట్టణంలో గ్యార్మీ వేడుకలు శుక్రవారం రాత్రి ఘనంగా ఘనంగా, సంప్రదాయబద్ధంగా జరిగాయి.పీర్ల ముజావర్ షేక్ యూసుఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలు భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగాయి. తరతరాలుగా వస్తున్న మతపరమైన ఆచార సంప్రదాయాలను కొనసాగిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు మత పెద్దలు,కమిటీ సభ్యులు,స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.



గ్యార్మీ పండుగలో భాగంగా నిర్వహించిన ర్యాలీ సంప్రదాయబద్ధంగా కొనసాగింది.పీర్ల ముజావర్ షేక్ యూసుఫ్ నేతృత్వంలో మరో ముఖ్య మత పెద్ద మాలీ సాబ్‌తో పాటు కమిటీ సభ్యులు షేక్ బడేమియా,షేక్ నన్నే సాబ్,షేక్ నాగులా సహకారంతో వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆధ్యాత్మిక సంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు.



ఆధ్యాత్మిక సంప్రదాయాల పరిరక్షణకు ప్రాధాన్యం.గ్యార్మీ పండుగ మతపరమైన విశ్వాసాలకు, ఆధ్యాత్మిక సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది. ఇలాంటి వేడుకలు సమాజంలో పరస్పర గౌరవం,ఐక్యత, సోదరభావం పెంపొందించడానికి దోహదపడతాయి. పండుగ సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో మత పెద్దలు,నిర్వాహకుల పాత్ర కీలకమని ఈ వేడుకలు చాటిచెప్పాయి.




ఈ కార్యక్రమంలో షేక్ యాసిన్ పాషా (దాదా),మదారి జానీ, పటాన్ జానీ,షేక్ నాగుల్,మీరా,సోందు, రఫీ,అక్బర్, సైదా( ఆర్.ఎం.పి) మహిళలు చిన్నారులు ఉత్సాహంగా ర్యాలీలో తదితర ప్రముఖులు పాల్గొన్నారు. స్థానికుల సహకారం, మత పెద్దల సమన్వయంతో గ్యార్మీ వేడుకలు ఘనంగా కొనసాగాయి.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు