కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షుడిగా షేక్ నిజాముద్దీన్ నియామకం - ముస్లిం సంఘం ఘన సన్మానం

 తల్లాడ మండల కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షుడిగా షేక్ నిజాముద్దీన్ నియామకం



తల్లాడ: కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీ సెల్ తల్లాడ మండల అధ్యక్షుడిగా షేక్ నిజాముద్దీన్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా సోమవారం తల్లాడలో ముస్లిం సంఘం ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.


తల్లాడ ముస్లిం సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. సదర్ అక్బర్, మౌలానా ముజిద్ రెహమాన్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు షేక్ నిజాముద్దీన్‌ను శాలువాలతో సన్మానించి అభినందించారు.



ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు మాట్లాడుతూ, తల్లాడ మండలంలో ముస్లిం సమాజానికి ప్రాతినిధ్యం వహించే పదవి రావడం సంతోషకరమని అన్నారు. గతంలో ముస్లిం సమాజ సమస్యలను పరిష్కరించడానికి సరైన వేదిక లేకపోయేదని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఈ పదవి రావడం ద్వారా సమస్యల పరిష్కారానికి అవకాశం లభించిందని తెలిపారు.


మైనార్టీ వర్గాల అభివృద్ధి, విద్య, ఉపాధి అవకాశాలు, సంక్షేమ పథకాల అమలు విషయంలో కొత్త అధ్యక్షుడు కృషి చేయాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా చూడాలని, యువతకు మార్గదర్శకంగా నిలవాలని సూచించారు.



అనంతరం నూతన అధ్యక్షుడు షేక్ నిజాముద్దీన్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ముస్లిం సమాజ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని, పార్టీ బలోపేతానికి పాటుపడతానని హామీ ఇచ్చారు. అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తానని తెలిపారు.



ఈ పదవిని తల్లాడ ప్రాంత ముస్లిం సమాజానికి గుర్తింపుగా భావిస్తున్నామని ముస్లిం సోదరులు తెలిపారు. ఈ అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.




ఈ కార్యక్రమంలో ఎండి ముస్తఫా, పఠాన్ నాగులు మీరా, డాక్టర్ సైదా ఖాజా మియా, షేక్ చాంద్ పాషా, షేక్ జానీ మియా, కాసిం సా గిడ్డే, మాజీ నాయబు సదర్ షేక్ మెహరాజ్, షేక్ సైదులు తదితర ముస్లిం సోదరులు పాల్గొన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు