ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో విహార యాత్ర



• పులిగుండాల ప్రాజెక్ట్‌ను సందర్శించిన విలేకరులు




తల్లాడ: అక్టోబర్ 12 మన తెలుగు A న్యూస్

తల్లాడ మండల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం మండల విలేకరులు విహార యాత్ర నిర్వహించారు.



 ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుడిపల్లి నారాయణ నాయకత్వంలో విలేకరుల బృందం కల్లూరు మండల పరిధిలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పులిగుండాల ప్రాజెక్ట్‌ను సందర్శించింది. నిరంతరం వార్తా సేకరణ, బిజీ షెడ్యూల్‌తో గడిపే విలేకరుల మానసిక ఉల్లాసం కొరకు ఈ యాత్రను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రాజెక్ట్ పరిసరాల్లోని ప్రకృతి అందాలను విలేకరులు తిలకించి, కాసేపు ఆహ్లాదంగా గడిపారు.



ఈ కార్యక్రమంలో తల్లాడ మండల ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి మోదుగు జయరాజు, గౌరవ అధ్యక్షులు దుగ్గిదేవర అజయ్ కుమార్,సీనియర్ విలేకరులు ఎండి. ముస్తఫా,అప్పిరెడ్డి,రుద్రాక్ష నరసింహచారి, షేక్ మేహరాజ్,నాగబాబు, షేక్ సైదా  మేడి బసవయ్య,మేడి యాకోబు,,వాడ వల్లి నాగేశ్వరరావు,షేక్ సైదా, పొన్నం శ్రీనివాసరావు,ఇసేనపల్లి బాబురావు,గుమ్మా నరేష్,ధూపాటి నరేష్,అద్దంకి ప్రసాద్,గురజాల నారాయణ రావు, కరుణాకర్ రెడ్డి, ప్రసాద్ తో పాటు మండల ప్రెస్ క్లబ్ సభ్యులు, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు




కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు