మంగాపురం యూపీఎస్ పాఠశాలలో ప్రహరీ గోడకు శంకుస్థాపన - నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే మట్టా రాగమయి






*నిధులు మంజూరు చేసిన సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి*



 తల్లాడ, అక్టోబర్ 07:( మన తెలుగు A న్యూస్)


మండలంలోని మంగాపురం గ్రామ యూపీఎస్ పాఠశాలలో మంగళవారం ప్రహరీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. విద్యార్థినీ, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, పాఠశాల భద్రతను దృష్టిలో ఉంచుకుని గ్రామ సర్పంచ్ దుగ్గిదేవర నాగ నరసింహారావు మరియు ఉప సర్పంచ్ గుజ్జర్లపూడి చింటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది.


వారి వినతిని వెంటనే స్పందించిన సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి మట్టా రాగమయి దయానంద్ వెంటనే నిధులు శాంక్షన్ చేయించి, పాఠశాల చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే సహకారంతో ఈ పనులు ప్రారంభం కావడం పట్ల గ్రామస్తులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


ఈ శంకుస్థాపన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దుగ్గిదేవర నాగ నరసింహారావు, ఉప సర్పంచ్ గుజ్జర్లపూడి చింటూ,  బాలకృష్ణ, పంచాయతీ కార్యదర్శి పరుశురాం, పాఠశాల హెడ్మాస్టర్ వెంకటరెడ్డి  వెంగన్నపేట సర్పంచ్, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా సర్పంచ్ నాగ నరసింహారావు మాట్లాడుతూ, గ్రామంలో విద్యా ప్రమాణాలు పెంచడానికి తమ వంతు కృషి చేస్తామని, పాఠశాల అభివృద్ధికి ఎమ్మెల్యే ఎల్లప్పుడూ సహకరిస్తున్నారని తెలిపారు. ఉప సర్పంచ్ గుజ్జర్లపూడి చింటూ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, మంగాపురం పాఠశాలను ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దుతామని అన్నారు.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు