ఆశయాల వారధి అభివృద్ధి సారథి కామ్రేడ్ దొడ్డ కృష్ణయ్య
33 ఏళ్లుగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన అమరజీవి.
ఆయన ఆశయాలను ఆచరణలో కొనసాగిస్తున్న దొడ్డ శ్రీనివాసరావు.
అక్టోబర్ అక్టోబర్ 8, మన తెలుగు A న్యూస్
పేదలు,బడుగు బలహీన వర్గాల ప్రజల కష్టాలను ఆకళింపు చేసుకుని, వారి అభ్యున్నతే ధ్యేయంగా జీవితాంతం ప్రజా ఉద్యమాల్లో ముందుండి పోరాడిన అమరజీవి కామ్రేడ్ దొడ్డ కృష్ణయ్య ఆశయాలు నేటికీ ప్రజలకు స్ఫూర్తిదాయకమని సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సండ్ర వెంకట వీరయ్య అన్నారు.
అన్నారుగూడెం స్వగ్రామంలో బుధవారం నిర్వహించిన కామ్రేడ్ దొడ్డ కృష్ణయ్య 33వ వర్ధంతి సభలో ఆయన పాల్గొని మాట్లాడారు.మూడు దశాబ్దాలకు పైగా కాలం గడిచినా దొడ్డ కృష్ణయ్యను ప్రజలు గుండెల్లో నిలుపుకోవడం ఆయన ప్రజల కోసం చేసిన సేవలకు నిదర్శనమన్నారు.ఈ సందర్భంగా సభకు తరలివచ్చిన అశేష జనవాహినే ఆయనపై ప్రజలకు ఉన్న అభిమానానికి ప్రత్యక్ష సాక్ష్యమని పేర్కొన్నారు.ప్రజల కష్టాలే తన కర్తవ్యంగా భావించిన నేత.నమ్ముకున్న సిద్ధాంతం కోసం అలుపెరగని పోరాటం సాగిస్తూ,సీపీఎం కార్యకర్తగా వివిధ హోదాల్లో పనిచేసిన దొడ్డ కృష్ణయ్య ప్రజలకు అండగా నిలిచారని సండ్ర వెంకట వీరయ్య అన్నారు.ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి,పేదల పక్షాన నిలబడటమే తన రాజకీయ బాధ్యతగా భావించిన ఆయన జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయమన్నారు
నిజమైన ప్రజాపాలనకు నిబద్ధతతో కూడిన నాయకత్వం అవసరమని నమ్మిన దొడ్డ కృష్ణయ్య,తన జీవితాన్ని ప్రజా సేవకే అంకితం చేశారని కొనియాడారు.తండ్రి ఆశయాలకు, అన్న స్ఫూర్తికి ప్రతిరూపంగా దొడ్డ శ్రీనివాసరావు.దివంగత నేత అమరజీవి దొడ్డ కృష్ణయ్య ఆశయాలను భుజాన వేసుకుని,ఆయన చూపిన ప్రజా సేవా మార్గంలో ముందుకు సాగుతున్న తల్లాడ మాజీ ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు ప్రజా జీవితంలో ప్రత్యేక ముద్ర వేస్తున్నారని సండ్ర వెంకట వీరయ్య అన్నారు.
తండ్రి అందించిన ఆశయాలను,అన్న దొడ్డ కృష్ణయ్య చూపిన ప్రజా సేవా స్ఫూర్తిని తన రాజకీయ ప్రస్థానానికి మార్గదర్శకంగా చేసుకుని దొడ్డ శ్రీనివాసరావు ప్రజల మధ్య నిరంతరం ఉంటున్నారని పేర్కొన్నారు.ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయడం,ప్రజలకు అందుబాటులో ఉండటం ఆయన రాజకీయ జీవితంలో ప్రధాన లక్షణంగా నిలిచిందన్నారు.
ఆశయమే ఆచరణగా,ప్రజా సేవే లక్ష్యంగా.దొడ్డ కృష్ణయ్య ఆశయాలను కేవలం స్మరించుకోవడమే కాకుండా వాటిని ఆచరణలో పెట్టడమే ఆయనకు నిజమైన నివాళి అని భావిస్తూ దొడ్డ శ్రీనివాసరావు ముందుకు సాగుతున్నారని సండ్ర వెంకట వీరయ్య అన్నారు.ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా,తన మొక్కవోని దీక్షతో ప్రజా జీవితంలో కొనసాగుతున్నారని తెలిపారు.ముందుగా అమర జీవి కామ్రేడ్ దొడ్డ కృష్ణయ్య చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దొడ్డ కృష్ణయ్య అమరహై అని నినాదాలు చేశారు.
దొడ్డ కృష్ణయ్య ఆశయాలకు వారసుడిగా,ప్రజా సేవా ప్రస్థానానికి కొనసాగింపుగా దొడ్డ శ్రీనివాసరావు నిలుస్తున్నారని అన్నారు.తండ్రి దీవెనలు,అన్న ఆశయాలు,ప్రజల నమ్మకాన్ని తనకు బలంగా చేసుకుని మరింత ఉత్సాహంతో ప్రజల్లోకి వెళ్తున్నారని పేర్కొన్నారు.33 ఏళ్లుగా దొడ్డ కృష్ణయ్య జ్ఞాపకాలను గుండెల్లో పదిలంగా ఉంచుకున్న అన్నారుగూడెం ప్రజలు ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న దొడ్డ శ్రీనివాసరావుకు అండగా నిలవడం ఈ వర్ధంతి సభ ప్రత్యేకతగా నిలిచిందని సండ్ర వెంకట వీరయ్య అన్నారు.
ఈ కార్యక్రమంలో తల్లాడ మాజీ ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు,స్థానిక సర్పంచ్ గొడ్ల ప్రభాకర్,బిఆర్ఎస్ మండల అధ్యక్షులు రెడ్డెం వీర మోహన్ రెడ్డి, మండల కార్యదర్శి దుగ్గీదేవర వెంకట్ లాల్,వార్డు మెంబర్స్,బాలపేట మాజీ సర్పంచ్ కోసూరి వెంకట నరసింహారావు, వేమా శ్రీనివాసరావు జొన్నలగడ్డ కిరణ్ బాబు,దగ్గుల శ్రీనివాసరెడ్డి,ఉప సర్పంచ్ లు శనక్కాయల సత్యనారాయణ, ఇంజం కృష్ణార్జునురావు, మాజీ ఉప సర్పంచ్ దిరిశాల నరసింహ రావు,మాజీ ఎంపీటీసీ ఆదూరి వెంకటేశ్వర్లు, యువజన నాయకులు ఎస్ ఎస్ రెడ్డి, సంఘసాని శ్రీను, వనిగండ్ల అశోక్,కొమ్మినేని శ్రీనివాసరావు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





0 కామెంట్లు
మీ అభిప్రాయాన్ని తెలపండి! 🙏
ఈ వార్తపై మీ కామెంట్ ఇక్కడ రాయండి - మన ఖమ్మం వార్తల కోసం!