రోడ్డుకు అడ్డంగా కూలిన రెండు చెట్లు.. ప్రమాదకరంగా మారిన తల్లాడ - బిల్లుపాడు మార్గం

 

 ప్రమాదకరంగా మారిన తల్లాడ - బిల్లుపాడు కొత్త వెంకటగిరి రామచంద్రపురం బిల్లుపాడు మార్గం


*రాత్రి నుంచి రోడ్డుపైనే పడి ఉన్న వృక్షాలు.. పట్టించుకోని అధికారులు.. వాహనదారుల తీవ్ర ఇబ్బందులు*



*తల్లాడ, సెప్టెంబర్ 27: (మన తెలుగు A-న్యూస్)


ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అంజనాపురం గ్రామపంచాయతీ పరిధిలోని రేజర్ల గ్రామంలో రోడ్డు ప్రమాదకరంగా మారింది. బిల్లుపాడు, కొత్త వెంకటగిరి, గూడూరు వెళ్లే ప్రధాన మార్గంలో శనివారం రాత్రి రెండు  వృక్షాలు నడిరోడ్డు మీద కూలిపోయాయి. దీంతో ఆ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది



 ఆదివారం ఉదయం వరకు కూడా కూలిన చెట్లను అధికారులు తొలగించకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మా కెమెరాకు చిక్కిన దృశ్యాలలో ఒక ఆటో, ఒక బైక్ చెట్టును దాటడానికి నానా తంటాలు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆటో డ్రైవర్ పక్కనున్న పొలం గట్టు మీద నుండి జాగ్రత్తగా వెళ్తుండగా, బైక్ వచ్చే వ్యక్తి కూడా ప్రమాదకరంగా రోడ్డు దాటాల్సి వస్తోంది.


ఈ మార్గం గుండా ప్రతిరోజూ వందలాది మంది రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు వెళ్తుంటారు. రాత్రి సమయంలో ఈ చెట్లు కూలి ఉండటంతో అదృష్టవశాత్తు ఎవరికీ ప్రమాదం జరగలేదు. ఒకవేళ రాత్రి సమయంలో వాహనాలు వెళ్తుంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



రెండు వేర్వేరు చోట్ల రెండు చెట్లు కూలడంతో రోడ్డు పూర్తిగా మూసుకుపోయింది. ద్విచక్ర వాహనాలు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. వెంటనే సంబంధిత పంచాయతీ అధికారులు, ఫారెస్ట్ మరియు R&B శాఖ అధికారులు స్పందించి కూలిన చెట్లను తొలగించి రాకపోకలను పునరుద్ధరించాలని రేజర్ల, అంజనాపురం, బిల్లుపాడు గ్రామస్తులు కోరుతున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు