*బిల్లుపాడు వాసికి అండగా సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి.. హైదరాబాద్ నిమ్స్ సర్జరీకి 5 లక్షల ఎల్ ఓ సి *
*జక్కంపూడి కిషోర్ సహకారంతో వేగంగా స్పందించిన ఎమ్మెల్యే.. బాధిత కుటుంబంలో హర్షం*
*తల్లాడ, సెప్టెంబర్ 26: (మన తెలుగు A-న్యూస్)*
ఖమ్మం జిల్లా తల్లాడ మండలం బిల్లుపాడు గ్రామపంచాయతీ పరిధిలోని డిబీ కాలనీకి చెందిన సిరికొండ వీరభద్రరావు కుటుంబానికి సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ అండగా నిలిచారు. అనారోగ్యంతో బాధపడుతున్న వీరభద్రరావుకు హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో సర్జరీ నిమిత్తం 5 లక్షల రూపాయల ఎల్ ఓ సి లెటర్‌ను అందజేశారు.
బిల్లుపాడు డి బి కాలనీకి చెందిన సరికొండ వీరభద్రరావు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆర్థికంగా నిరుపేద కావడంతో ఖరీదైన వైద్యం చేయించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వైద్యుల సూచన మేరకు హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో సర్జరీ చేయాల్సి ఉందని, దీనికి సుమారు 5 లక్షల రూపాయలు ఖర్చవుతుందని తెలిసింది. ఈ విషయాన్ని స్థానిక నాయకులు జక్కంపూడి కిషోర్ దృష్టికి తీసుకెళ్లారు.
జక్కంపూడి కిషోర్ సహకారంతో ఈ విషయం వెంటనే సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ దృష్టికి చేరింది. దీనిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 5 లక్షల రూపాయల ఎల్ ఓ సి లెటర్ మంజూరు చేయించారు. ఈ ఎల్ ఓ సి లెటర్‌ను తన చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ మాట్లాడుతూ పేద ప్రజలకు వైద్య సాయం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఎవరూ డబ్బులు లేక వైద్యానికి దూరం కాకూడదని అన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు.
ఎల్ ఓ సి అందడంతో సరికొండ వీరభద్రరావు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్‌కు, జక్కంపూడి కిషోర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేస్తున్న సేవలను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో కోడూరి రాము జోసఫ్ నాగులు మీరా కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు


0 కామెంట్లు
మీ అభిప్రాయాన్ని తెలపండి! 🙏
ఈ వార్తపై మీ కామెంట్ ఇక్కడ రాయండి - మన ఖమ్మం వార్తల కోసం!