*దివంగత జక్కంపూడి కృష్ణమూర్తి-ప్రేమలత జ్ఞాపకార్థం కళాకారులకు టీ-షర్టుల పంపిణీ*
*తండ్రి ఆశయ సాధనే లక్ష్యంగా ముమ్మరంగా సేవా కార్యక్రమాలు: జక్కంపూడి కిషోర్*
*తల్లాడ, సెప్టెంబర్ 22 ( మన తెలుగు ఏ న్యూస్ ): తల్లాడ మండలం బిల్లుపాడు గ్రామానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అనుచరుడు, రాజకీయ చాణక్యుడిగా పేరుగాంచిన దివంగత జక్కంపూడి కృష్ణమూర్తి మరియు ఆయన సతీమణి ప్రేమలత జ్ఞాపకార్థం వారి తనయుడు, కాంగ్రెస్ మండల నాయకుడు జక్కంపూడి కిషోర్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక డప్పు కళాకారులకు టీ-షర్టులు పంపిణీ చేశారు.
తల్లాడ మండల కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గొడుగునూరి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారితో కలిసి కళాకారులకు టీ-షర్టులు అందజేశారు.
ఈ సందర్భంగా జక్కంపూడి కిషోర్ మాట్లాడుతూ.. తల్లాడ రాజకీయాల్లో తిరుగులేని నాయకుడిగా, ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ గెలుపులో కీలక పాత్ర పోషించిన తన తండ్రి జక్కంపూడి కృష్ణమూర్తి ఆశయాలను ఎప్పటికీ కొనసాగిస్తానని స్పష్టం చేశారు. తన తండ్రి పేరుతో నిరంతరం ప్రజాసేవలో ముందంజలో ఉంటానని, ఆయన చూపిన బాటలోనే నడుస్తానని పేర్కొన్నారు.
గతంలో బిల్లుపాడు గ్రామ ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం కార్పొరేట్ ఆసుపత్రుల సహకారంతో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించిన విషయాన్ని గుర్తుచేశారు. భవిష్యత్తులో మండల వ్యాప్తంగా మరిన్ని విస్తృత సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గోవింద్ శ్రీనివాసరావు, ఓబీసీ సెల్ ఉపాధ్యక్షుడు కోసూరు వెంకటేశ్వరరావు, సొసైటీ చైర్మన్ దిరిశాల నరసింహారావు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు దుండేటి వీరారెడ్డి, పగడాల అచ్చిరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మారెళ్ల మల్లికార్జునరావు, మండల ఉపాధ్యక్షుడు తాళ్ల జోసెఫ్, కళాకారుల బృందం అధ్యక్షులు కాంపల్లి వంశీ, రావుల గోపి గౌడ్ తో పాటు పలువురు సర్పంచులు, ఉప సర్పంచులు, కాంగ్రెస్ శ్రేణులు మరియు కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



0 కామెంట్లు
మీ అభిప్రాయాన్ని తెలపండి! 🙏
ఈ వార్తపై మీ కామెంట్ ఇక్కడ రాయండి - మన ఖమ్మం వార్తల కోసం!