వర్షాన్ని సైతం లెక్కచేయని భక్తి సందడి



స్థానిక సర్పంచ్ పెరికే నాగేశ్వరావు నేతృత్వంలో.





తల్లాడలో ఘనంగా కలశం ఊరేగింపు.


ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు, పిల్లలు.


తల్లాడ సెప్టెంబర్ 23, ( మన తెలుగు A న్యూస్ )




వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా తల్లాడ పట్టణంలో మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పెరికే నాగేశ్వరరావు నేతృత్వంలో కలశం ఊరేగింపు కార్యక్రమం బుధవారం భక్తిశ్రద్ధలు, ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. శ్రీనగర్ కాలనీ వాసులు, వ్యాపారస్తులు, వర్తకులు,మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఊరేగింపును విజయవంతం చేశారు.

జోరువానలోనూ జోష్ తగ్గలేదు,
ఊరేగింపు కొనసాగుతున్న సమయంలో జోరుగా వర్షం కురిసినా భక్తులు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఉత్సాహంగా ముందుకు సాగారు. కలశాలతో డ్యాన్స్ చేస్తూ,భక్తి గీతాలకు అనుగుణంగా సందడి చేస్తూ ప్రేక్షకులను అలరించారు.వర్షాన్ని సైతం లెక్కచేయకుండా మహిళలు,పిల్లలు, యువత ఉత్సాహంగా పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.



సర్పంచ్ పెరికే నాగేశ్వరరావు నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, వ్యాపారులు, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో భాగస్వాములు కావడంతో తల్లాడ పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది.భక్తి, ఉత్సాహం,ఐక్యతకు ప్రతీకగా ఊరేగింపు
భక్తి శ్రద్ధలతో సాగిన కలశం ఊరేగింపు ఆద్యంతం ఆకట్టుకుంది.

ఈ కార్యక్రమంలో తల్లాడ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పెరికే నాగేశ్వరరావు,శ్రీనగర్ గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు గురివిందల సుధా నాయుడు,కోడూరి రాము,ఆపతి రామారావు,చిహెచ్. కృష్ణమూర్తి,పసుమర్తి శ్రీనివాసరావు,యూత్ కమిటీ సభ్యులు ప సుమర్తి హరీష్,పెరికే మణిశంకర్,తొండపు తరుణ్,త్రివేణ్, గౌతమ్ వేమిశెట్టి, సోనూ ఎస్.కె.,నవీన్ కొమ్మినేని,మనోజ్ కుమార్ గుర్రం, ఉదయ్,నిమ్మల మనోజ్,హేమంత్, సూర్య,వరుణ్, సాత్విక్ తదితరులు పాల్గొననున్నారు.

 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు