కోటగిరి రంగారావు 15వ వర్ధంతి సందర్భంగా..విద్యార్థుల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ఉపాధ్యాయులకు శిక్షణ* ..

 టీచింగ్ టు ట్రాన్స్ ఫార్మింగ్ వైపు అడుగులు అనే నినాదంతో..





కోటగిరి రంగారావు మెమోరియల్ టీచర్స్ డెవలప్‌మెంట్ సమ్మిట్ 2026.




తల్లాడ సెప్టెంబర్ 16, (మన తెలుగు ఏ న్యూస్) 


కెఎస్ఎం విద్యాసంస్థల వ్యవస్థాపకులు  కోటగిరి రంగారావు  15వ వర్ధంతి సందర్భంగా ఉపాధ్యాయుల అభివృద్ధి,ఆధునిక విద్యా విధానాలపై అవగాహన కల్పించే లక్ష్యంతో బాలభారతి విద్యాలయంలో కోటగిరి రంగారావు మెమోరియల్ టీచర్స్ డెవలప్‌మెంట్ సమ్మిట్ 2026 కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు.




ఈ సందర్భంగా విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు వారి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో బాలభారతి ప్రీమియర్ లీగ్  క్రీడా పోటీలను ప్రారంభించారు.క్రీడా జ్యోతిని వెలిగించి పోటీలకు శ్రీకారం చుట్టారు.క్రీడా జ్యోతి వెలిగించడం ద్వారా క్రమశిక్షణ,ఐక్యత, క్రీడాస్ఫూర్తి,పట్టుదల వంటి విలువలను విద్యార్థుల్లో పెంపొందించేలా కార్యక్రమాన్ని నిర్వహించారు.బోధన నుంచి పరిశోధన వైపు 2030 నాటికి బాలల కోసంఉపాధ్యాయులను సిద్ధం చేయడం అనే ప్రధాన అంశంతో నిర్వహించిన ఈ సదస్సులో ఉపాధ్యాయుల వృత్తి నైపుణ్యాలను మరింత అభివృద్ధి చేయడం,ఆధునిక విద్యా విధానాలను తరగతి గదిలో సమర్థవంతంగా వినియోగించడం వంటి అంశాలపై శిక్షణ,అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా తల్లాడ మండల విద్యాధికారి దామోదర వరప్రసాద్ ను,ఆ విద్యాసంస్థల కరస్పాండెంట్ కోటగిరి ప్రవీణ్,డైరెక్టర్ కోటగిరి శ్రావణి,ప్రిన్సిపాల్ రామారావు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పుష్పగుచ్చం అందజేసి శాలువాలతో ఘనంగా సన్మానించి సత్కరించారు.

ఈ సదస్సులో ఉపాధ్యాయుల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్,సైన్స్ ప్రయోగాలు,క్రియేటివిటీ,టిఎల్ఎం తదితర అంశాలపై నిపుణులు అవగాహన కల్పించారు.ఆధునిక సాంకేతికతను విద్యాబోధనలో సమర్థవంతంగా వినియోగిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకత, పరిశోధనా దృక్పథాన్ని పెంపొందించే విధానాలపై వివరించారు.
కేఎస్ఎంవిద్యాసంస్థల అభివృద్ధికి కోటగిరి రంగారావుఅందించిన సేవలను ఈ సందర్భంగా పలువురు స్మరించుకున్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా నాణ్యమైన విద్యను అందిస్తూ ప్రతి విద్యార్థికి మెరుగైన విద్యా అవకాశాలు కల్పించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సద్వ్యవహారం పంచుకోవడం,ఆదరించడం,పరివర్తన తీసుకురావడం అనే స్ఫూర్తితో విద్యార్థుల్లో విలువలను పెంపొందించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కే ఎస్ఎం విద్యాసంస్థల కరస్పాండెంట్ కోటగిరి ప్రవీణ్,డైరెక్టర్ కోటగిరి శ్రావణి, ప్రముఖ  వ్యాపారవేత్త దారా విష్ణు మోహన్ రావు, సీనియర్ జర్నలిస్ట్ దుగ్గిదేవర అజయ్ కుమార్, ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు