తుపాను ప్రభావంతో అప్రమత్తంగా ఉండాలి - ఎస్సై వెంకటకృష్ణ..
తల్లాడ సెప్టెంబర్ 24, (మన తెలుగు A న్యూస్):
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తల్లాడ మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తల్లాడ ఎస్సై వెంకటకృష్ణ హెచ్చరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ - రాగల 2 రోజులు ఈదురుగాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిందన్నారు. కావునా మండల ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు.
ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు, రైతులు, మత్స్యకారులు మరింత జాగ్రత్తగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ చెరువులు, వాగులు, కాలువల వద్దకు వెళ్లవద్దని కోరారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లకు దూరంగా ఉండాలని సూచించారు.
ఎక్కడైనా చెట్లు పడిపోవడం, రోడ్లపై వరద నీరు, కరెంట్ సమస్యలు వంటివి ఎదురైతే వెంటనే తల్లాడ పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని, ప్రజల భద్రత కోసం పోలీస్ శాఖ 24 గంటలు అందుబాటులో ఉంటుందని ఎస్సై వెంకటకృష్ణ తెలిపారు.
పోలీస్ స్టేషన్ నెంబర్ - 8712667717"

0 కామెంట్లు
మీ అభిప్రాయాన్ని తెలపండి! 🙏
ఈ వార్తపై మీ కామెంట్ ఇక్కడ రాయండి - మన ఖమ్మం వార్తల కోసం!